![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -917 లో.. వసుధార, రిషి ఇద్దరు విశ్వనాథ్ ఇంటి నుండి బయలుదేరి వస్తుంటారు. ఏంజిల్ మనల్ని నమ్మడం లేదని రిషి అంటాడు. ఏంటి వసుధార మా అమ్మ చనిపోయిన విషయం వాళ్ళతో చెప్పలేదని అనుకుంటున్నావా అని రిషి అంటాడు.. అవును మీరు మేడమ్ గురించి చెప్తే ఏంజిల్ నమ్మేది కదా అని వసుధార అనగానే.. మా అమ్మ చనిపోలేదు. ఎప్పుడు నాతోనే, మనతోనే ఉంటుందని రిషి అంటాడు.
ఆ తర్వాత వసుధార, రిషి ఇద్దరు ఇంటికి వస్తారు. కాసేపటికి మహేంద్ర దగ్గరికి వస్తారు.. మహేంద్ర వాలకం చూసి మళ్ళీ డ్రింక్ చేసాడని అనుకుంటారు. కానీ మహేంద్ర నిద్ర నుండి లేచి, నేను డ్రింక్ చెయ్యలేదు. నీకు మాట ఇచ్చాను కదా అని అంటాడు. ఆ తర్వాత అన్నయ్య వదిన శైలేంద్ర వచ్చారు. కలిసి లంచ్ కూడా చేసానని మహేంద్ర అంటాడు. ఇప్పుడు భోజనం చెయ్యండని వసుధార అనగానే ఇప్పుడు అక్కడకి రాలేను.
నువ్వే ఇక్కడికి భోజనం తీసుకొని రా అని మహేంద్ర చెప్పగానే వసుధార వెళ్తుంది. ఆ తర్వాత రిషిని ప్రేమతో దగ్గరగా కూర్చొపెట్టుకొని మాట్లాడతాడు. జగతి, మహేంద్రల మధ్య ప్రేమ గురించి మహేంద్ర చెప్తాడు. ఆ తర్వాత వసుధార గురించి కూడా చెప్తాడు. " వసుధార చాలా మంచి అమ్మాయి. నువ్వంటే చాలా ఇష్టం " మహేంద్ర గొప్పగా చెప్తుంటాడు. మరొకవైపు వసుధార డోర్ దగ్గర వరకు వచ్చి.. వాళ్ళ మాటలు వింటూ అక్కడే ఆగిపోతుంది. వసుధార ప్రేమ విషయంలో పడిన కష్టాలు రిషికి మహేంద్ర చెప్తుంటాడు. వసుధార, నువ్వు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి. తన కంట్లో కన్నీళ్లు రాకుండా చూసుకోవాలని రిషితో మహేంద్ర చెప్తాడు. తప్పకుండా డాడ్ వసుధారని ఎప్పుడు హ్యాపీగా చూసుకుంటానని రిషి చెప్తాడు. వసుధార గురించి మహేంద్ర గొప్పగా చెప్పడం విని వసుధార ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత భోజనం తీసుకొని వచ్చి మహేంద్రకి ఇచ్చి వెళ్ళిపోతుంది వసుధార.
మరుసటి రోజు ఉదయం వసుధార వంట చేస్తూ.. రాత్రి రిషితో మహేంద్ర చెప్పిన మాటలు గుర్తుకు చేసుకుంటు ఉంటుంది. అప్పుడే వసుధారకి రిషి కొత్తగా జూమ్కాలు తీసుకొని వచ్చి సర్ ప్రైజ్ ఇస్తాడు. వసుధార చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వసుధార జూమ్కాలు పెట్టుకొబోతుంటే తనని ఆపి నేను పెడతానంటు రిషి ట్రై చేస్తుంటే తనకి పెట్టరాదు. ఇదేంటి ఇది పెద్ద ఇంజినీరింగ్ టాస్క్ లా ఉందే అంటు రిషి కష్టపడుతుంటాడు. ఆ తర్వాత రిషి అటుతిప్పి, ఇటుతిప్పి జుమ్కాని కిందపడేస్తాడు. ఇక వసుధార, రిషి ఇద్దరు కలిసి దానిని వెతికే పనిలో పడతారు. జుమ్కా రిషికి దొరుకుతుంది కానీ వసుధారని కొద్దిసేపు అటపట్టిద్దామని అనుకుంటాడు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |